సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samanta about her favourite roles in films
  • ఇష్టమైన పాత్ర గురించి సమంత
  • క్రేజీ కాంబో కోసం బండ్ల గణేశ్ ప్రయత్నాలు
  • పవన్ టైటిల్ తో మాధవీలత సినిమా
*  'నాకు ఇష్టమైన పాత్ర అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు..' అంటోంది అందాల కథానాయిక సమంత. 'ఎప్పటికప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా బాగా చేయాలని కోరుకుంటూ వుంటాను. అంతేతప్ప, ఫలానా పాత్ర అంటే ఇష్టమని మాత్రం నాకు లేదు. ప్రతి పాత్రనూ సీరియస్ గానే తీసుకుంటాను' అని చెప్పింది సమంత.    
*  గతంలో పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గణేశ్ ఇప్పుడు పవన్ తో మరో భారీ ప్రాజక్టును ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్-కొరటాల శివ కాంబినేషన్ కోసం తను ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
*  గతంలో పవన్ కల్యాణ్ 'సత్యాగ్రహి' పేరుతో ఓ చిత్రాన్ని చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే, అది కారణాంతరాల వల్ల సాధ్యపడలేదు. ఇప్పుడీ టైటిల్ తో మాధవీలత కథానాయికగా ఓ చిత్రం రూపొందుతోంది. పవన్ కల్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత యువకులదే అని చాటిచెబుతూ దీనిని రూపొందిస్తున్నారట. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు.
Go Back to Shorts
Samantha
Pawan Kalyan
Koratala Siva
Madhavi Latha

More Telugu News