బాలూ, నువ్వు తప్పకుండా రావాలి... నీకోసం కన్నీటి అభిషేకం చేస్తున్నాం: రాఘవేంద్రరావు
- బాలు కోసం తమిళ సినీ పరిశ్రమ సామూహిక ప్రార్ధన
- జూమ్ యాప్ ద్వారా ప్రార్థనలు చేసిన ప్రముఖులు
- భావోద్వేగాలకు లోనైన దర్శకేంద్రుడు
"ప్రపంచంలో ఉన్న నీ అభిమానులం అందరం నీకోసం కన్నీళ్లతో అభిషేకం చేస్తున్నాం బాలూ! నువ్వు తప్పకుండా రావాలి. మైక్ ముందు నీ గంభీరమైన గొంతు వినాలని ఉంది బాలూ. త్వరగా కోలుకుని వచ్చేయ్! నువ్వు కచ్చితంగా వస్తావు... మళ్లీ నీ పాటతో మమ్మల్ని అలరిస్తావు. గెట్ వెల్ సూన్ బాలూ!" అంటూ ఆ గాయక దిగ్గజం కోసం తన సందేశం వినిపించారు.