రియా, ఆమె సోదరుడిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు
- సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియాపై ఆరోపణలు
- ఆర్థిక కోణంపై ఈడీ దర్యాప్తు
- రియా, ఆమె సోదరుడిపై 7 గంటల పాటు విచారణ
ఈ ఉదయం రియా, ఆమె సోదరుడు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. వీరిద్దరినీ ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. సుశాంత్ కేసుకు సంబంధించి రియా, షోయిక్ లపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.
ఈ ఉదయం రెండు గంటల పాటు ఈడీ ప్రశ్నావళిని ఎదుర్కొన్న షోయిక్ ఆపై కార్యాలయం నుంచి బయటికి వచ్చాడు. కొన్ని కీలక పత్రాలు తీసుకురావాలంటూ అతడిని ఈడీ అధికారులే బయటికి అనుమతించారని ఆ తర్వాత తెలిసింది. ఆపై షోయిక్ కాసేపటికే మళ్లీ ఈడీ కార్యాలయానికి రాగా, మరోసారి విచారించారు.