వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై-కేటగిరీ భద్రతను కేటాయించిన కేంద్రం
- వైసీపీ ఎమ్మెల్యేలతో ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురాజు
- నిన్న రాత్రి సమాచారం అందిందన్న రఘురాజు
- ఇప్పట్లో నియోజకవర్గానికి రాలేనన్న ఎంపీ
వై-కేటగిరీ కింద తనకు దాదాపు 10 మంది సెక్యూరిటీగా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని... కర్ఫ్యూని సడలించిన తర్వాత వస్తానని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం భద్రతను కల్పించిందని చెప్పారు. తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.