రాఫెల్ యుద్ధ విమానాలకు సచిన్ టెండూల్కర్ స్వాగతం.. జైహింద్ అంటూ ట్వీట్
- వీటి రాకతో మన సైనిక బలగాలకు మరింత సామర్థ్యం
- అణ్వస్త్రాలతో దాడి చేయగల సామర్థ్యం రాఫెల్ సొంతం
- తొలి విడతలో భాగంగా 5 విమానాల రాక
అణ్వస్త్రాలతో దాడి చేయగల సామర్థ్యం ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్స్ కోసం 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ మొత్తం 59 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 విమానాలు రావాల్సి ఉండగా, తొలి విడతలో భాగంగా రెండు రోజుల క్రితం ఐదు విమానాలు భారత్ చేరుకున్నాయి.