సినీ పరిశ్రమలో సరికొత్త విభాగం?
- షూటింగులపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా
- కోవిడ్ ప్రొటెక్షన్ అనే విభాగాన్ని ప్రారంభించే యోచనలో ఇండస్ట్రీ
- యూనిట్ కరోనా బారిన పడకుండా కాపాడటమే ఈ విభాగం పని
ఈ నేపథ్యంలో, ఇండస్ట్రీలో కోవిడ్ ప్రొటెక్షన్ అనే సరికొత్త విభాగాన్ని ప్రారంభించాలనే నిర్ణయానికి సినీ పెద్దలు వచ్చినట్టు సమాచారం. అవుట్ డోర్ లో కానీ, ఇండోర్ లో కానీ యూనిట్ లో ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టడమే ఈ విభాగం పని. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ విభాగం రక్షణ చర్యలను చేపడుతుంది. ప్రభాస్ తాజా చిత్రం 'రాధేశ్యామ్' షూటింగును ఈ విధానం ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. కెమెరాలను, కాస్ట్యూమ్స్ ను ప్రత్యేకమైన పద్ధతుల్లో శుభ్రపరుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.