రోగం కాదు... మాయదారి రోగం... బ్యూటీ పార్లరే ఐసొలేషన్ సెంటర్!
- జూబ్లీహిల్స్ లో కలర్స్ బ్యూటీ స్టూడియో
- రూములను ఐసొలేషన్ గదులుగా మార్చి అద్దెకు
- దందాను అడ్డుకున్న పోలీసులు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లో ఉన్న కలర్స్ బ్యూటీ స్టూడియోలో ఈ దందా మొదలైంది. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులకు ఐసోలేషన్ పేరిట ఇక్కడ గదులు అద్దెకివ్వడం ప్రారంభించారు. ఎటువంటి నిబంధనలనూ పాటించడం లేదు. వైద్యం మినహా మిగతా అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలను కల్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్రమ దందాపై ఉక్కుపాదం మోపి, నిర్వాహకులను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.