పెళ్లి విషయం గురించి అతడితో జరిగిన చివరి సంభాషణ ఇదే.. రియా గురించి నాకు తెలియదు: సుశాంత్ తండ్రి
Add ap7am to your home Screen

పెళ్లి విషయం గురించి అతడితో జరిగిన చివరి సంభాషణ ఇదే.. రియా గురించి నాకు తెలియదు: సుశాంత్ తండ్రి

dont know who is ria sushanth father
  • పెళ్లి చేసుకోవాలని సుశాంత్‌ను చాలాసార్లు అడిగాం
  • కరోనా వ్యాప్తి తొలగిపోయాకే నిర్ణయం తీసుకుంటానన్నాడు
  • 2021 మార్చిలో పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు
  • నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చన్నాం
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ తీవ్ర ఒత్తిడితో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన గురించి ఆయన‌ తండ్రి కేకే సింగ్ ఓ ఇంటర్వ్యూలో‌ పలు వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకోవాలని సుశాంత్‌ను చాలాసార్లు అడిగామని, అయితే, కరోనా వ్యాప్తి తొలగిపోయాకే పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడని కేకే సింగ్ చెప్పారు.

2021 ఫిబ్రవరి లేక మార్చిలో పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నానని చెప్పాడని తెలిపారు. తన కుమారుడితో పెళ్లి గురించి జరిగిన చివరి సంభాషణ ఇదేనని వివరించారు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని తన కుమారుడికి చెప్పామని ఆయన తెలిపారు.

కానీ, తన కుమారుడు శాశ్వతంగా తమకు దూరమయ్యాడని కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు అందరితో కలిసిమెలసి ఉండేవాడని, అంతలోనే ఎందుకు కుంగుబాటుకు గురయ్యాడో తెలియదని చెప్పారు. సినీ నటి అంకిత లోఖండేతో తమ కుటుంబానికి పరిచయం ఉందన్నారు.

అలాగే, తాను నటి కృతి సనన్‌ను కూడా ఓసారి ముంబైలో కలిశానని చెప్పారు. అయితే, రియా చక్రవర్తి గురించి మాత్రం తనకేమీ తెలియదని తెలిపారు. మరోపక్క సుశాంత్ ప్రియురాలుగా రియా చక్రవర్తి పేరు ప్రచారమవుతోన్న విషయం తెలిసిందే.
sushanth
Bollywood

More Telugu News