ప్రజల దాహం కంటే బీర్లే ముఖ్యమా?: ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
- సింగూరు ప్రాజెక్టు నీటిని మళ్లిస్తున్నారని హరీశ్ రావు ఆరోపణ
- రాష్ట్రంలో కరెంట్ కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న మాజీ మంత్రి
- కోట్ల మంది తాగునీటి అవసరాలను పట్టించుకోవడం లేదని విమర్శ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలను పక్కనపెట్టి, బీర్ ఫ్యాక్టరీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వం నీటి, విద్యుత్ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
సింగూరు ప్రాజెక్టు అంశాన్ని హరీశ్ రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరమ్మతుల పేరుతో ప్రాజెక్టు నుంచి 29 టీఎంసీల నీటిని ఖాళీ చేసి, పనులను అసంపూర్తిగా వదిలేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నా, దానిని బీర్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజల తాగునీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్లే రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగాయని, ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీశ్ రావు అన్నారు. ఎల్ నినో ప్రభావంపై ముందుగానే హెచ్చరికలు ఉన్నప్పటికీ, దేవాదుల, కల్వకుర్తి వద్ద నీటిని లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ఇది కృత్రిమ కరవుకు దారితీసిందని దుయ్యబట్టారు. మద్యం కంపెనీలకు నీటి కొరత రాకూడదని ఎక్సైజ్ మంత్రి వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు.