ప్రతి నియోజకవర్గంలో ఒక శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది: మంత్రి ఆనం
- శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఆలయాలు నిర్మించడమే లక్ష్యమన్న ఆనం
- ప్రతి నియోజకవర్గంలో రూ.5 నుంచి రూ.10 కోట్లతో శ్రీవారి ఆలయం
- 6,700 ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు నెలకు రూ.10,000 జమ
రాష్ట్రవ్యాప్తంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా 5,000 ఆలయాలను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ... రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి ఆలయానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 6,700 ఆలయాల్లో దూప, దీప, నైవేద్యాల కోసం అర్చకుల ఖాతాల్లో ప్రతినెలా రూ.10,000 జమ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి ఆనం శంకుస్థాపన చేశారు. సోమశిల జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా ఆత్మకూరుకు తాగునీరు సరఫరా చేస్తున్నామని, పట్టణంలో అంబేద్కర్, షాదీ మంజిల్ భవనాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఆయన అన్నారు.