రంజీ ట్రోఫీకి అన్యాయం.. బీసీసీఐ షెడ్యూలింగ్‌పై గవాస్కర్ అసంతృప్తి
- రంజీ ట్రోఫీ సమయంలో ఇండియా 'ఏ' మ్యాచ్‌ల నిర్వహణపై గవాస్కర్ విమర్శలు
- కీలక ఆటగాళ్లు రాష్ట్ర జట్లకు దూరమవుతున్నారని ఆవేదన
- రంజీ ట్రోఫీకి బీసీసీఐ పెద్దపీట వేయాలని డిమాండ్
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వకుండా, అదే సమయంలో ఇండియా 'ఏ' మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడాన్ని ఆయన తప్పుబట్టాడు. ఈ విధానం వల్ల దేశవాళీ టోర్నీ ప్రాధాన్యతను బీసీసీఐయే తగ్గిస్తోందని ఆయన విమర్శించాడు.
రంజీ ట్రోఫీ సీజన్ కొనసాగుతుండగా ఇండియా 'ఏ' మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల చాలా మంది కీలక ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండటం లేదని గవాస్కర్ అన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా 'ఏ'తో జరిగిన మ్యాచ్ కారణంగా రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు తమ జట్ల తొలి రంజీ మ్యాచ్‌లకు దూరమయ్యారని గుర్తుచేశాడు. త్వరలో జరగనున్న న్యూజిలాండ్ 'ఏ' పర్యటనతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
"రంజీ ట్రోఫీలో అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనకపోవడం వల్ల దేశవాళీ క్రికెటర్ల నిజమైన సత్తాను అంచనా వేయడం కష్టంగా మారుతోంది. రంజీల్లో రాణించిన కొందరు అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బంది పడటం మనం చూస్తున్నాం" అని గవాస్కర్ పేర్కొన్నాడు. పోటీ బలహీనపడితే ఒక బ్యాటర్ 2000 పరుగులు చేయడం, బౌలర్ 100 వికెట్లు తీయడం వంటి తప్పుడు గణాంకాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
అన్ని రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లేట్ డివిజన్‌ను చేర్చడం వల్ల టోర్నీ మొత్తం ప్రమాణాలు తగ్గాయని కూడా గవాస్కర్ అన్నాడు. ఇండియా 'ఏ' మ్యాచ్‌లను దేశవాళీ సీజన్‌కు అడ్డంకి లేకుండా నిర్వహించాలని, రంజీ ట్రోఫీకి బీసీసీఐ పెద్దపీట వేయాలని సన్నీ సూచించాడు. గవాస్కర్ వాదనకు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా మద్దతు పలకడం గమనార్హం.