మరో రికార్డు... ఒక్కరోజులో 14,516 కొత్త కరోనా కేసులు!
- శరవేగంగా మహమ్మారి విజృంభణ
- శుక్రవారం నాడు 375 మరణాలు
- 3.95 లక్షలను దాటిన మొత్తం కేసులు
ప్రస్తుతం 1,68,269 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 2,13,831 మంది చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇప్పటివరకూ 12,948 మంది మరణించారని వెల్లడించింది. కాగా, కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుతుండటంతో, కరోనా వైరస్ అధికంగా వ్యాపించివున్న పలు ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.