ఈఎస్ఐ స్కామ్ కేసు.. తిరుపతిలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ అరెస్ట్!

ESI Ex Director Ramesh Kumar Also Arrested
  • టీడీపీ అధికారంలో ఉన్న వేళ విధులు
  • ఆయన హయాంలోనే స్కామ్ జరిగినట్టు ఆరోపణలు
  • నిన్న రాత్రి ఏసీబీ దాడులు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈఎస్ఐ స్కామ్ జరిగిందన్న ఆరోపణలున్న వేళ, ఆ శాఖ డైరెక్టర్ గా పనిచేసిన రమేశ్ కుమార్ ను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయన తిరుపతిలో నివాసం ఉంటుండగా, గత రాత్రి, అచ్చెన్నాయుడితో పాటు, ఆయన ఇంటిపైనా ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు, ఈ ఉదయం ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ స్కామ్ లో ఆయనపైనా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడి మాదిరిగానే, రమేశ్ కుమార్ ను కూడా విజయవాడ తరలిస్తున్నారా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
Go Back to Shorts
ESI
Ramesh Kumar
Tirupati

More Telugu News