సినీ హీరో అక్షయ్ కుమార్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?.. ఫోర్బ్స్ జాబితాలో వెల్లడి
- అత్యధికంగా సంపాదిస్తోన్న సెలబ్రిటీల జాబితా
- తొలి 100 సెలబ్రిటీల జాబితాలో అక్షయ్
- రూ.366 కోట్ల ఆదాయంతో 52వ స్థానం
- 'కాస్మెటిక్' రారాణి కైలీ జెన్నర్‌కు అగ్రస్థానం
గత ఏడాది ఆయన ఆ జాబితాలో రూ.490 కోట్లతో 33వ స్థానంలో నిలిచారు. కాగా, 'కాస్మెటిక్' రారాణి కైలీ జెన్నర్ ఆ జాబితాలో ఈ ఏడాది రూ. 4,453 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అక్షయ్ కుమార్‌తో అమెజాన్ ప్రైమ్ డిజిటల్ సిరీస్ కోసం రూ.75 కోట్లతో ఒప్పందం చేసుకోవడంతో ఈ ఏడాది ఆయన సంపాదనకు ఈ అంశం కలిసి వచ్చింది. ఈ జాబితాలో కైలీ జెన్నర్ తర్వాత వరుసగా కన్యే వెస్ట్, రోజర్ ఫెదరర్, క్రిస్టియనో రొనాల్డో చోటు సంపాదించుకున్నారు.