కృష్ణ బర్త్‌డే సందర్భంగా యంగ్ హీరో సుధీర్ బాబు ట్వీట్ చేసిన వీడియో వైరల్!
- సీతారామరాజు డైలాగులు చెప్పిన సుధీర్
- బ్రిటిష్ వారు కాల్చుతున్నప్పుడు సినిమాలో డైలాగులు
- అచ్చం కృష్ణలా చెప్పిన సుధీర్
ఓ వైపు ఆ సినిమాలో కృష్ణ నటించిన సీన్‌ను, మరోవైపు కృష్ణ చెప్పిన డైలాగులను అచ్చం అలాగే చెబుతూ సుధీర్ బాబు ఈ వీడియోను ట్వీట్ చేశాడు. ఆ వీడియో ఘట్టమనేని అభిమానులను ఆకర్షిస్తోంది. అల్లూరి సీతారామ రాజు సినిమాలో బ్రిటిష్ సైనికులు అల్లూరిని తుపాకులతో కాల్చుతున్నప్పుడు 'ఒక్క సీతారామ రాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పుట్టుకొస్తారు..' అంటూ ఈ డైలాగులు ఉంటాయి.