ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం!: చంద్రబాబునాయుడు
- నేడు ఎన్టీఆర్ 97వ జయంతి
- కోట్లాది సామాన్యులకు అండగా నిలిచిన మేరునగ ధీరుడు
- ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం.
ఆపై "ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం... తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. "సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ల"ని చాటుదాం" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.