'మీ వ్యాఖ్యలు నిఖిల్ పెళ్లి గురించేనా?'... నెటిజన్ ప్రశ్నకు నటి మాధవీలత సమాధానం ఇది!

Actress Madhavilatha Comment on Nikhil Marriage
  • నా పోస్ట్ సెలబ్రిటీల వివాహాలపైనే
  • నా భావాలను వ్యక్తం చేసే హక్కు నాకుంది
  • నిఖిల్ పెళ్లిగురించేనా? అంటే 'ఏమో' అంటూ దాటవేత
లాక్ డౌన్ సమయంలో జరుగుతున్న పెళ్లిళ్లపై నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాస్కులు పెట్టుకుని పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన ఆమె, ఇంకో సంవత్సరం ఆగితే పిల్ల దొరకదా? అని కూడా వ్యాఖ్యానించారు. మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకని, పెళ్లి కోసం కొన్నాళ్లు ఆగలేనివారు జీవితాంతం సంసారం ఏం చేస్తారని అడిగింది.

ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా, ఓ నెటిజన్ ఆమెను "మీరు చెబుతున్నది నిఖిల్ పెళ్లి గురించేనా?" అని మాధవీలతను ప్రశ్నించాడు. దీనికి ఆమె 'ఏమో' అంటూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేసింది. పేదలంతా లాక్ డౌన్ ను పాటిస్తుంటే, సెలబ్రిటీలు మాత్రం మాస్కులతో పెళ్లిళ్లు చేసుకునేందుకు తొందర పడుతున్నారని, తన పోస్ట్ సెలబ్రిటీలను ఉద్దేశించే చేశానని వెల్లడించారు.

ఇక మాధవీలతపై ట్రోల్స్ కూడా పెరిగాయి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, మీ ఉచిత సలహాలు ఏంటని కొందరు విమర్శలకు దిగారు. వీటిపైనా స్పందించిన మాధవీలత, తన ఫేస్ బుక్ లో పోస్ట్ తన ఇష్టమని, తన భావాన్ని వ్యక్తం చేసే హక్కు తనకుందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Madhavi Latha
Nikhil
Facebook

More Telugu News