నిజమే .. ప్రభాస్ సినిమాలో చేస్తున్నాను: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
- షూటింగు దశలో ప్రభాస్ మూవీ
- కథానాయికగా పూజ హెగ్డే
- కీలకమైన పాత్రలో భాగ్యశ్రీ
అయితే ఈ సినిమాలో ఆమె నిజంగానే చేస్తుందా ? లేదంటే పుకారు మాత్రమేనా? అనే అయోమయం అభిమానుల్లో నెలకొంది. దాంతో తాజాగా ఈ సినిమాను గురించి భాగ్యశ్రీ స్పందించారు. 'నిజమే .. నేను ప్రభాస్ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్ గా నాకు సంతృప్తిని ఇచ్చే పాత్ర ఇది. ఇంతవరకూ నేను చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో ఇది ఒకటి అవుతుంది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో చేస్తున్నందుకు సంతోషంగా వుంది" అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. భాగ్యశ్రీకి అంతగా నచ్చేసిన ఆ పాత్ర ఏమిటో చూడాలి మరి.