మహేశ్ నన్ను 'సార్' అని పిలిచేవారు: 'అల్లరి' నరేశ్
- 'మహర్షి' చేయడం మరిచిపోలేని అనుభవం
- ఆ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది
- వ్యక్తిత్వం విషయంలోను ఆయన సూపర్ స్టారే
'మహర్షి' సినిమాలో చేయడం ఒక మరిచిపోలేని అనుభవం. నటన పరంగా నాకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టిన పాత్ర అది. ఆ సినిమా షూటింగు సమయంలో మహేశ్ బాబు నన్ను 'సార్' అని పిలిచేవారు. ఆయన అలా పిలుస్తున్నప్పుడల్లా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. సెట్లో అందరితోను ఆయన చాలా కలుపుగోలుగా వుంటారు. మహేశ్ బాబును చాలా దగ్గరగా చూసే అవకాశాన్ని ఈ సినిమా నాకు కలిగించింది. నటన పరంగానే కాదు, వ్యక్తిత్వం విషయంలోను ఆయన సూపర్ స్టారే' అంటూ చెప్పుకొచ్చాడు. 'అల్లరి' నరేశ్ తాజా చిత్రంగా 'నాంది' రూపొందుతున్న సంగతి తెలిసిందే.