వరుణ్ తేజ్ సినిమా వచ్చేది అప్పుడే!
- బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్
- పరిశీలనలో 'బాక్సర్' టైటిల్
- జూలై 30న విడుదల చేసే ఛాన్స్
ఈ సినిమాలో ఒక కథానాయికగా సయీ మంజ్రేకర్ ను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కీలకం కానుంది. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 2' .. 'గద్దలకొండ గణేశ్' భారీ విజయాలను సాధించాయి. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.