పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సినీ నటి మాధవీలత
- ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిని కొట్టడమేంటి?
- ఫైన్ వేయాలి, లేదా కేసు పెట్టాలి
- అత్యవసరం ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారు
ఈ నేపథ్యంలో, పోలీసుల తీరును సినీ నటి మాధవీలత తప్పుపట్టింది. స్టుపిడ్ పోలీసులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బయటకు వచ్చిన వారికి ఫైన్ వేయాలని లేదా కేసులు పెట్టాలని... అంతేతప్ప ఇలా దారుణంగా కొట్టడమేమిటని ఆమె ప్రశ్నించింది. అత్యవసరం ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారని... పనిపాటా లేని వారు ఒకరిద్దరు బయటకు వస్తే, మిగిలిన వారిని కూడా కొట్టడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల చర్య సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది.