మహేశ్ బాబు అభినందనలు మరిచిపోలేను: యాంకర్ ప్రదీప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు అభినందనలు మరిచిపోలేను: యాంకర్ ప్రదీప్

30 Rojullo Preminchadam Ela Movie
  • పాట సూపర్ హిట్ అయింది 
  • మహేశ్ బాబుగారికి నచ్చింది 
  • 50 మిలియన్ల మందికి రీచ్ అయిందన్న ప్రదీప్
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ, తను నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాను గురించి ప్రస్తావించాడు. "ఈ సినిమా నుంచి వదిలిన 'నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా .. ' పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను మహేశ్ బాబుగారికి చూపించాము. ఆయన ఆ పాటను చూస్తుంటే .. నేను ఆయన ఎక్స్ ప్రెషన్స్ ను చూస్తుండిపోయాను.

పాట అంతా చూసిన మహేశ్ బాబుగారు, 'చాలా బాగుంది ప్రదీప్ .. చాలా బాగా తీశారు .. నువ్ చాలా బాగున్నావ్ .. నాకు నిజంగా నచ్చింది ప్రదీప్' అన్నారు. ఆయనలా అభినందించడంతో నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. మేము రిక్వెస్ట్ చేసిన మేరకు ఆయన ఆ పాటను లాంచ్ చేశారు. అన్ని ఫ్లాట్ ఫామ్స్ కలుపుకుని దగ్గర దగ్గరగా 50 మిలియన్ల మందికి ఆ పాట రీచ్ కావడం ఆనందాశ్చర్యాలను కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.
Pradeep
Mahesh Babu
30 Rojullo Preminchadam Ela Movie

More Telugu News