చిరూ డాన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కొరటాల
- చిరంజీవితో సందేశంతో కూడిన వినోదభరిత చిత్రం
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- హైలైట్ గా నిలవనున్న చిరూ స్టెప్స్
చిరంజీవికి నుంచి అభిమానులు ఆశించే మరో ముఖ్యమైన అంశం డాన్స్. ఈ విషయంలో అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లోను నిరాశకి లోను కాకూడదని కొరటాల .. సంగీత దర్శకుడు మణిశర్మకి చెప్పారట. చిరూ స్టైల్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన బాణీలను సమకూర్చుతున్నట్టు చెబుతున్నారు. ఆ బాణీలకు స్టెప్స్ కూడా కొత్తగా డిజైన్ చేయించే ఆలోచనలో కొరటాల వున్నాడని అంటున్నారు. కథాకథనాలతో పాటు సంగీతం .. డాన్స్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచేలా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు.