'అమృత.. అమ్మ దగ్గరికి వెళ్లామ్మా' అంటూ కన్నీరు పెట్టిన టీవీ యాంకర్ శ్వేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అమృత.. అమ్మ దగ్గరికి వెళ్లామ్మా' అంటూ కన్నీరు పెట్టిన టీవీ యాంకర్ శ్వేత

Bjp leader swetha Reddy shocking facts about maruthi rao
  • చాలా గారాబంగా అమృతను తండ్రి పెంచుకున్నారు
  • తన వద్దకు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు
  • పాపే ప్రాణంగా బతికిన తండ్రి ఈరోజు నేలరాలిపోయారు
  • అమ్మ దగ్గరుంటే అమృత సంతోషంగా ఉంటుంది
ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై టీవీ యాంకర్, బీజేపీ నాయకురాలు శ్వేతా రెడ్డి స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.  ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త తెలుసుకుని చాలా బాధపడ్డానని తెలిపారు.

 చాలా గారాబంగా పెంచుకున్న అమృతను తన వద్దకు తెచ్చుకోవాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సిందని అన్నారు. ఒకపై ఉమెన్స్ డే వచ్చిన ప్రతి సారి తనకు ఆయన చనిపోయిన ఘటనే గుర్తుకువస్తుందని చెప్పారు.

పాపే ప్రాణంగా బతికిన తండ్రి ఈరోజు నేలరాలిపోయారని శ్వేతారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. ప్రాణానికి ప్రాణంలా చూసుకున్న అమృత దూరమైపోతే మారుతీరావు ఎంత నరకం అనుభవించి ఉంటారోనని అన్నారు. తన కూతురిని ఎలాగైనా ఇంటికి తెచ్చుకోవాలని మారుతీరావు తనతో ఇటీవల చెప్పారని తెలిపారు. ఇప్పటికైనా అమృత ఆలోచించుకుని, మొండిపట్టుని వీడి తన కుమారుడిని తీసుకుని అమ్మ గిరిజ దగ్గరకు వెళ్లిపోవాలని ఆమె సూచించారు.

అప్పుడే మారుతీరావు ఆత్మ శాంతిస్తుందని తెలిపారు. అమ్మ దగ్గరుంటే అమృత సంతోషంగా ఉంటుందని చెప్పారు. తండ్రులకు గౌరవం ఇచ్చే తనలాంటి ఆడపిల్లలంతా కలిసి, కావాలంటే పాదాభివందం చేస్తామని అమృతకు తెలుపుతూ ఆమెను తల్లి వద్దకు వెళ్లిపోవాలని కోరారు. అవసరమైతే తాను అమృత కాళ్లుపట్టుకుంటానని చెప్పారు.
maruthi rao
swetha Reddy

More Telugu News