'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' నుంచి ఆహ్లాదకరమైన లిరికల్ వీడియో
- వెంకటేశ్ మహా నుంచి మరో విభిన్న కథా చిత్రం
- అనుభూతి పరిమళాన్ని వెదజల్లే బిజిబల్ సంగీతం
- ఆకట్టుకుంటున్న విజయ్ ఏసుదాస్ గానం
"నింగి చుట్టే మేఘం ఎరుగదా ఈ లోకం గుట్టూ .. మునిలా మెదలదు నీ మీదొట్టు .. కాలం కదలికలతో జోడీకట్టు .. " అంటూ ఈ పాట సాగుతోంది. బిజిబల్ సంగీతం .. విశ్వ సాహిత్యం .. విజయ్ ఏసుదాస్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. గ్రామీణ నేపథ్యంలో ప్రధాన పాత్రను ప్రకృతికిస్తూ, అనుబంధాలు .. అనుభూతుల కలయికగా ఈ కథ సాగనున్నట్టు ఈ పాటను బట్టి అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.