లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి

Bribe Taking Record Assistant caught by ACB
  • రూ.10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన రికార్డ్ అసిస్టెంట్
  • డిప్యూటీ డీఈవో ఆఫీసులో పనిచేస్తున్న బాబురాజ్
  • రికార్డులను తనిఖీ చేస్తోన్న ఏసీబీ అధికారులు
తెలంగాణలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడ్డాడు. హైదరాబాద్ లోని సైదాబాద్ డిప్యూటీ డీఈవో కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బాబురాజ్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ రోజు బాబూరాజ్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Go Back to Shorts
Record Assistant
ACB
Caught
Bribery
Telangana

More Telugu News