రూ.100 కోట్ల ఆస్తులు.. అసిస్టెంట్ మేనేజర్ అవినీతి బాగోతం బట్టబయలు
- మహబూబాబాద్ పౌరసరఫరాల శాఖ అధికారి ఇళ్లపై ఏసీబీ దాడులు
- అసిస్టెంట్ మేనేజర్ నరసింహారావు అక్రమాస్తుల గుర్తింపు
- మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఆస్తులు
- రికార్డుల్లో రూ.9.41 కోట్లుగా చూపిన అధికారులు
- బినామీల పేర్లతో భారీగా భూములు, భవనాలు, రైస్ మిల్లు
పౌరసరఫరాల శాఖలో ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో ఉండి, జిల్లా ఇన్‌చార్జి మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి ఏకంగా రూ.100 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు.
మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ ఇన్‌చార్జి మేనేజర్‌గా పనిచేస్తున్న వాసంశెట్టి నరసింహారావు నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం వీటి డాక్యుమెంట్ విలువ రూ.9.41 కోట్లుగా ఉందని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు.
నరసింహారావు, ఆయన బంధువులు, బినామీల పేర్ల మీద ఖమ్మం, హైదరాబాద్‌లలో బహుళ అంతస్తుల భవనాలు, ఖాళీ స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండలో రూ.76 లక్షల డాక్యుమెంట్ విలువ ఉన్న భూమికి, అగ్రిమెంట్‌లో ఏకంగా రూ.6.54 కోట్లుగా చూపడం గమనార్హం.
నరసింహారావు ఇంట్లో 360 గ్రాముల బంగారం, 331 గ్రాముల వెండి, రూ.20 లక్షల విలువైన మూడు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన గృహోపకరణాలు, ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా లభించాయి. 2011లో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరిన ఈయన, ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బినామీ పేరుతో ఓ రైస్ మిల్లు నడుపుతున్నట్టు అనుమానిస్తున్నామని, బ్యాంకు లాకర్లు, ఇతర వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.