'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి మరో సాంగ్!
- ప్రేమకథాంశంతో క్రాంతిమాధవ్
- నలుగురు కథానాయికలతో విజయ్ దేవరకొండ
- వచ్చేనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఈ విషయాన్ని తెలియపరుస్తూ వదిలిన పోస్టర్ ను బట్టి, ఇది విజయ్ దేవరకొండ - కేథరిన్ పై చిత్రీకరించిన పాట అని తెలుస్తోంది. గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఇతర కథానాయికలుగా రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లే లైట్ కనిపించనున్నారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.