పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి స్నేహ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి స్నేహ

  • నిన్న స్నేహకు ప్రసవం
  • ఆనందంలో మునిగిపోయిన కుటుంబం
  • ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందంటూ సంబరాలు
సినీ నటి స్నేహ నిన్న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సినీ నటుడు ప్రసన్నను స్నేహ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే విహాన్ అనే కుమారుడు ఉన్నాడు. శుక్రవారం నాడు ఆడబిడ్డ పుట్టడంతో వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందని స్నేహ దంపతులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో అగ్ర నటీమణుల్లో ఒకరిగా స్నేహ వెలుగొందింది. కెరీర్ ఉన్నతపథంలో ఉన్న సమయంలో 2012లో ప్రసన్నను ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలను తగ్గించిన స్నేహ... క్యారెక్టర్ రోల్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి బిజీగా ఉంది.
కూతురు పుట్టిన సందర్భంగా స్నేహ షేర్ చేసిన ఫొటో
Sneha
Prasanna
Tollywood

More Telugu News