రజనీకాంత్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను: నటుడు బాబీసింహా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను: నటుడు బాబీసింహా

  • బాబీసింహా తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
  • రవితేజతో తలపడే విలన్ పాత్ర 
  • రజనీ మనసున్న మనిషన్న బాబీసింహా
తమిళంలో హీరోగా .. విలన్ గా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ బాబీసింహా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అవకాశాన్ని బట్టి ఆయన తెలుగులోను చేస్తున్నాడు. రవితేజ హీరోగా చేసిన 'డిస్కోరాజా'లో ఆయన విలన్ గా చేశాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాబీసింహా మాట్లాడుతూ రజనీకాంత్ ను గురించి ప్రస్తావించాడు.

"మొదటి నుంచి కూడా నేను రజనీకాంత్ గారి సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. రజనీకాంత్ గారి స్టైల్ .. ఆయన డైలాగ్ డెలివరీ అంటే నాకు ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లోకి వచ్చాను. 'జిగర్తాండ' సినిమా సమయానికి నేను పాప్యులర్ కాదు. కానీ రజనీకాంత్ గారు నన్ను మెచ్చుకున్నారు. ఆయనని కలవడానికి వెళితే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్ గారు సూపర్ హీరో .. అంతకు మించిన మంచి మనసున్న మనిషి" అని చెప్పుకొచ్చాడు.
Raviteja
Bobby Simha

More Telugu News