పెద్దపల్లికి ‘స్వచ్ఛత దర్పణ్’ పురస్కారం.. అవార్డు అందుకున్న కలెక్టర్ శ్రీదేవసేన

  • ‘స్వచ్ఛభారత్’ మిషన్ లో పెద్దపల్లి మరోమారు రికార్డు
  • ఢిల్లీలో ‘స్వచ్ఛత’ వర్క్ షాప్ లో పాల్గొన్న శ్రీదేవసేన
  • అమీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్
కేంద్ర ప్రభుత్వ ‘స్వచ్ఛభారత్’ మిషన్ లో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మరోమారు రికార్డులకెక్కింది. పూర్తి స్థాయిలో సామూహిక, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం- వినియోగించడం, ఇంకుడు గుంతలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన పెంచడం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని పెద్దపల్లికి ‘స్వచ్ఛత దర్పణ్’ అవార్డు లభించింది.

ఈ అవార్డును పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన ఢిల్లీలో అందుకున్నారు. ‘స్వచ్ఛత’ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆమె పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతులమీదుగా ‘స్వచ్ఛత దర్పణ్’ అవార్డును ఆమె అందుకున్నారు.
Go Back to Shorts
swachaBharat
Peddapalli
Collector
Sridevasena

More Telugu News