అరెస్ట్ చేసిన మహిళలను రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో ఎలా ఉంచుతారు?: టీడీపీ ఎంపీ కనకమేడల
- ఏపీ రాజధానిలో చల్లారని ఉద్రిక్తతలు
- మహిళలను అరెస్ట్ చేశారంటూ కనకమేడల ఆగ్రహం
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
అరెస్ట్ చేసిన మహిళలను రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల తర్వాత పీఎస్ లో మహిళా కానిస్టేబుల్స్ లేకుండా మహిళలను ఎలా ఉంచుతారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మహిళా కమిషన్ కు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.