ఏపీలో మళ్లీ పెరిగిన విజయ పాల ధరలు.. నేటి నుంచే అమల్లోకి
- నాలుగు నెలల క్రితమే మూడు కేటగిరీల్లో పెంపు
- ఇప్పుడు మరో మూడు కేటగిరీల్లో పెంచిన విజయ డెయిరీ
- ఫుల్ క్రీం, గోల్డ్ పాల ధరలపై లీటరుకు రూ. 4 పెంపు
విజయ ప్రీమియం లీటర్ పాలపై రూ. 2 పెంచి రూ.52 చేయగా, ఫుల్ క్రీం పాల ధరను రూ.4 పెంచి రూ.58 చేసింది. విజయ గోల్డ్ పాల ధర ఇప్పటి వరకు లీటరుకు రూ. 56 ఉండగా, ఇప్పుడు దానిని రూ.60కి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్టు విజయ డెయిరీ ప్రకటించింది.