సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఖాళీగా ఏమీ లేనంటున్న తమన్నా 
  • ప్రభాస్ షూటింగ్ మరోసారి వాయిదా 
  • మహేశ్ సినిమాకి ఉక్రెయిన్ లో క్రేజ్
  *  తాను పనిలేక ఖాళీగా వున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని అందాలభామ తమన్నా ఖండించింది. తానేమీ ఖాళీగా లేననీ, ఏడాదిలో ప్రతి రోజూ బిజీగానే వున్నానని పేర్కొంది. తెలుగులో కాకపోయినా ఏదో ఒక భాషలో నటిస్తూనే వున్నానని చెప్పింది.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'జాన్' చిత్రం తాజా షెడ్యూలు మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలో ఈ షూటింగ్ మొదలవ్వాలి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 17 నుంచి అన్నపూర్ణా స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో నిర్వహిస్తారట.
*  అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ లో ఈ చిత్రం టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే పూర్తయినట్టు నిర్మాత అనిల్ సుంకర ప్రకటించారు. పదిరోజుల ముందుగానే ఉక్రెయిన్ లో మూడు లోకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్ అయిందంటూ ఆయన పేర్కొన్నారు.
Thamanna
Prabhas
Mahesh Babu
Anil Ravipudi

More Telugu News