విద్యార్థులు నాపై మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారు: ఢిల్లీ జేఎన్యూ వీసీ మామిడాల జగదీశ్ కుమార్ ఆరోపణ
- ఢిల్లీ జేఎన్యూలో హాస్టల్ ఫీజుల పెంపు
- విద్యార్థుల ఆగ్రహం
- దిగిరాని అధికార వర్గం
ఈ నేపథ్యంలో, తనపై 15 నుంచి 20 మంది విద్యార్థులు ఇవాళ దాడికి ప్రయత్నించారని, భద్రతా సిబ్బంది రావడంతో బతికిపోయానని వీసీ మామిడాల జగదీశ్ కుమార్ ఆరోపించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆయన కారులో విశ్వవిద్యాలయం నుంచి బయటికి వెళుతుండగా విద్యార్థులు అడ్డుకోవడం ఆ వీడియోలో కనిపించింది.