హైదరాబాద్ పోలీసులూ... మీకు సెల్యూట్: అల్లు అర్జున్, విశాల్, సైనా నెహ్వాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ పోలీసులూ... మీకు సెల్యూట్: అల్లు అర్జున్, విశాల్, సైనా నెహ్వాల్

  • చివరకు న్యాయం జరిగింది
  • తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు 
  • మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
దిశ హత్యాచార కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సినీ, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'న్యాయం జరిగింది' అంటూ సినీనటుడు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. 'చివరికి న్యాయం జరిగింది... తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు.. ఆర్ఐపీ దిశ' అని సినీనటుడు విశాల్ ట్వీట్ చేశారు.

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో న్యాయం జరిగిందని కథా రచయిత కోన వెంకట్ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ అని భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సినీ, క్రీడా ప్రముఖులు కోరుతున్నారు. హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Twitter
Allu Arjun
vishal

More Telugu News