పవన్ కల్యాణ్ ఆదేశిస్తే వైసీపీ నేతల తలలు నరుకుతా: జనసేన నాయకుడు సాకే పవన్
- మదనపల్లిలో అనంతపురం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం
- వైసీపీ బనాయించే కేసులకు భయపడే ప్రసక్తే లేదు
- ప్రకాశ్ రెడ్డే కాదు ఏ రెడ్డి తల నరికేందుకైనా సిద్ధమే
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఆదేశిస్తే కనుక ఇప్పుడే రంగంలోకి దిగుతానని, వైసీపీ నేతల తలలు నరుకుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బనాయించే కేసులకు తమ కార్యకర్తలెవరూ భయపడే ప్రసక్తే లేదని అన్నాడు. అనంతపురం జిల్లాలో ప్రకాశ్ రెడ్డే (రాప్తాడు ఎమ్మెల్యే) కాదు ఏ రెడ్డి అయినా సరే, వారి తలలు నరికేందుకు ‘నేను రెడీ’..‘మీరు రెడీనా?’ అంటూ కార్యకర్తలను ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో సభా వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ సహా నాదెండ్ల మనోహర్ తదితర నేతలు ఆశ్చర్యపోయారు.