ఆ ఏడు కొండలకు తప్ప అన్నింటికీ రంగులు వేశారు: పవన్ కల్యాణ్
- రాయలసీమలో పర్యటిస్తున్న పవన్
- వైసీపీపై ధ్వజం
- వైసీపీది రంగులరాజ్యమని ఎద్దేవా
తాను రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకునేందుకు కాదని పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాయలసీమలో రాజకీయనేతలకు పచ్చటి పొలాలున్నాయని, కానీ ఇక్కడి పేదలే పొట్ట చేతపట్టుకుని వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల రాజకీయాలు చేయని రోజు, రైతుల్ని ఇబ్బంది పెట్టని రోజే జగన్ ను గౌరవిస్తానని పవన్ స్పష్టం చేశారు.