అమ్మ భాష కోసం ఎవడున్నాడప్పా... పవన్ కల్యాణ్ ఒక్కడున్నాడప్పా: జనసేనానిపై జొన్నవిత్తుల పాట
- ఏపీలో ఇంగ్లీషు మీడియం
- ప్రభుత్వంపై వ్యతిరేకత
- పవన్ పై జొన్నవిత్తుల ప్రశంసలు
చెప్పేందుకు ఏముందీ మీ గొప్ప... చేసేందుకు ఏముందీ మీ గోల తప్పా అంటూ ఆయన రూపొందించిన పాట వీడియో రూపంలో వైరల్ అవుతోంది. ఇంగ్లీషు మీడియం అంశం నేపథ్యంలో తెలుగు భాష ప్రాశస్త్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలే జొన్నవిత్తుల అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు.