అంబాపురం రైతులకు అండగా ఉంటా: వల్లభనేని వంశీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబాపురం రైతులకు అండగా ఉంటా: వల్లభనేని వంశీ

  • అంబాపురం రైతుల భూముల్లో ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టిన అధికారులు
  • జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన వంశీ
  • రైతుల భూములు వెంటనే వెనక్కు ఇవ్వాలని విన్నపం
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాపురం గ్రామ రైతులకు అండగా ఉంటానని ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, చిన్న, సన్నకారు రైతుల భూముల్లో రెవిన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టి స్వాధీనం చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ, స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్దకు రైతులు రావాలని పిలిపించారు. అనంతరం వారి నుంచి వివరాలను సేకరించి జిల్లా కలెక్టర్ అహ్మద్ తో మాట్లాడారు. రైతుల భూములను వెంటనే వెనక్కు ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, ఎవరూ దిగులు పడొద్దని వంశీ ధైర్యం చెప్పారు. రైతులందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Vallabhaneni Vamsi
YSRCP

More Telugu News