డాక్టర్ కావాలనుకున్నాడు.. స్టార్ హీరో అయ్యాడు.. రూ.3,300 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు!
- అరవింద్ స్వామి సంస్థ టాలెంట్ మ్యాగ్జిమస్ విలువ రూ.3,300 కోట్లు
- తొలుత వైద్యుడిగా ఎదగాలని కోరుకున్నా.. సినిమాల్లోకి ప్రవేశించి సక్సెస్
- మణిరత్నం డైరెక్షన్లో ‘దళపతి’తో సినిమాల్లోకి అరంగేట్రం
- ప్రమాదం కారణంగా పక్షవాతానికి గురైన కాలు.. కోలుకోవడానికి ఐదేళ్లు
- కుమారుడితో కలిసి ఏఐ ఆధారిత వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అరవింద్
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన నటుడు అరవింద్ స్వామి. సినిమాల్లోనే కాదు.. వ్యాపార రంగంలోనూ అతడు భారీ విజయాన్ని సాధించాడు. ఆయనకు చెందిన టాలెంట్ మ్యాగ్జిమస్ ఇండియా సంస్థ 2022లో సుమారు రూ.3,300 కోట్ల విలువను చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇంతటి వ్యాపార విజయాన్ని అందుకున్న అతడు మాత్రం తనను తాను మంచి వ్యాపారవేత్తగా భావించరట. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తన వ్యాపార విధానం, సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అరవింద్ స్వామికి చిన్నప్పటి నుంచి వైద్యుడిగా ఎదగాలనే కోరిక ఉండేది. అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి తనకు స్ఫూర్తి అని తెలిపాడు. అయితే, వ్యాపారవేత్త అయిన తన తండ్రి వీడీ స్వామి సూచనతో బీకామ్ చదివి, అమెరికాలో ఇంటర్నేషనల్ బిజినెస్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఆ కోర్సును పూర్తి చేయకుండానే తిరిగి వచ్చాడు.
మణిరత్నం దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘దళపతి’తో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ‘రోజా’, ‘బొంబాయి’, ‘మిన్సార కనవు’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. స్టార్గా ఎదగడంకంటే సినిమా ప్రక్రియను నేర్చుకోవడంపైనే తనకు ఆసక్తి ఉండేదని చెప్పాడు. 2000ల ప్రారంభంలో నటనకు విరామం ఇచ్చి వ్యాపారంపై దృష్టి పెట్టాడు. కుటుంబ వ్యాపార సంస్థలతో పాటు పేరోల్, మానవ వనరుల సేవల రంగంలోనూ పనిచేశాడు. అనంతరం టాలెంట్ మ్యాక్సిమస్ సంస్థను అభివృద్ధి చేశాడు.
వ్యాపారంలో కొనసాగుతున్న సమయంలో జరిగిన ప్రమాదం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వెన్నెముకకు గాయమై కాలు పక్షవాతానికి గురైంది. కోలుకోవడానికి నాలుగైదేళ్ల చికిత్స అవసరమైందని ఆయన గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన ‘కడల్’తో 2013లో తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ‘తని ఒరువన్’లో ప్రతినాయకుడి పాత్ర ఆయనకు మరోసారి మంచి గుర్తింపు తెచ్చింది.
వ్యాపారవేత్తగా తనను తాను ‘చెడ్డవాడిని’ అని ఎందుకు అంటారో కూడా అరవింద్ స్వామి వివరించాడు. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే తనకు ఆసక్తి అని, వాటిని వ్యాపారంగా మార్చిన తర్వాత రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను ఇతరులకు అప్పగిస్తానని చెప్పాడు. కేవలం లాభాల కోసమే పనిచేయడం తనకు నచ్చదని తెలిపాడు.
అప్పుల విషయంలోనూ తాను చాలా జాగ్రత్తగా ఉంటానని, వ్యాపార విస్తరణ కోసం భారీగా అప్పులు చేయడాన్ని ఇష్టపడనని వెల్లడించాడు. ప్రస్తుతం తన కుమారుడు రుద్రతో కలిసి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతిక వ్యాపార ఇంక్యుబేటర్ను నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. సంస్థల కోసం అధునాతన సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాజెక్టుకు తన కుమారుడు నాయకత్వం వహిస్తున్నాడని చెప్పాడు.