వేదికపై తల్లిదండ్రులను చూసి 'క్రేజీ కల్యాణం' దర్శకుడు ఎమోషనల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేదికపై తల్లిదండ్రులను చూసి 'క్రేజీ కల్యాణం' దర్శకుడు ఎమోషనల్

Bhadrappa Gajula gets emotional seeing parents at Crazy Kalyanam event
  • 'క్రేజీ కల్యాణం' ప్రచార కార్యక్రమం
  • వేదికపై తల్లిదండ్రులను చూసి కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు
  • ఈ సినిమాతో తన తండ్రి పేరు నిలబెడతానని మాట
  • మనుషులకు జ్వరమొచ్చినా మా నాన్నకు బర్రెలకే ప్రాధాన్యత అని వ్యాఖ్య
  • అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల 
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉద్దెమారి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం 'క్రేజీ కల్యాణం'. ఈ సినిమా ద్వారా భద్రప్ప గాజుల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, రేపు (అక్టోబర్ 16న) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన 'బారాత్' ప్రచార కార్యక్రమంలో దర్శకుడు భద్రప్ప భావోద్వేగానికి గురయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తన తల్లిదండ్రులను వేదికపైకి పిలిచిన భద్రప్ప, వారి కష్టాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, "నాకు తెలివచ్చినప్పటి నుంచి మా నాన్నను ఎప్పుడూ కౌగిలించుకోలేదు. నేను ఏ పనీ చేయకుండా ఉన్న రోజుల్లో కూడా మా అమ్మానాన్నలు నా కోసం ఎంతో కష్టపడ్డారు. మా నాన్న ఇప్పటికీ పొలం పనులకు వెళతారు. ఇంట్లో మనుషులకు జ్వరమొచ్చినా పట్టించుకోరు కానీ, బర్రెలకే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తారు" అంటూ తన తండ్రి పడే శ్రమను వివరించారు.

తల్లిదండ్రుల సంతోషం కోసం తానింకా ఏమీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన భద్రప్ప,  'క్రేజీ కల్యాణం' సినిమాను తన తల్లిదండ్రులకే అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంతో తన తండ్రి పేరు నిలబెడతానని ఆయన మాటిచ్చారు. అనంతరం, వేదికపైనే తన తల్లిదండ్రులను గట్టిగా కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తన కృతజ్ఞతను చాటుకున్న ఈ దృశ్యం అక్కడున్న వారిని సైతం కదిలించింది.
Advertisement
Bhadrappa Gajula
Crazy Kalyanam
Anupama Parameswaran
Tharun Bhascker
Crazy Kalyanam Movie Promotions
Bhadrappa Gajula Parents

More Telugu News