పల్లె వీధుల్లో .. పండుగ నేపథ్యంలో 'క్రేజీ కళ్యాణం'
- అనుపమా పరమేశ్వరన్ నుంచి 'క్రేజీ కళ్యాణం'
- విలేజ్ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- సంగీత దర్శకుడిగా సురేశ్ బొబ్బిలి
- రేపు విడుదలవుతున్న సినిమా
సాధారణంగా ఒక పెద్ద సినిమా థియేటర్లలో ఉండగా .. మరో పెద్ద సినిమాతో పాటు థియేటర్లకు రావడానికి చిన్న సినిమాలు కాస్త ఆలోచన చేస్తూ ఉంటాయి. అయితే కంటెంట్ పై నమ్మకం ఉన్నప్పుడు పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు పోటీపడటం .. విజయాలను అందుకోవడం అప్పుడప్పుడు జరుగుతూ వచ్చింది. అలాంటి ఒక నమ్మకంతో ఇప్పుడు థియేటర్లలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న సినిమానే 'క్రేజీ కళ్యాణం'. రేపే (అక్టోబరు 16) ఈ సినిమా విడుదలవుతోంది.
ఆల్రెడీ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'జైలర్ 2' థియేటర్స్ కి వచ్చింది. తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వీకెండ్ లో మరింత దూకుడు చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ 'రణబాలి' ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చేస్తోంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అలాంటి ఈ సినిమాతోనే 'క్రేజీ కళ్యాణం' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
అనుపమా పరమేశ్వరన్ .. అఖిల్ రాజ్ .. తరుణ్ భాస్కర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో .. పల్లె మనుషుల పలకరింపులు నేపథ్యంలో నడిచే కథ ఇది. దసరా పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే వినోదంతో రూపొందిన కథ కావడం వలన, ఈ సినిమా ఈ పండగకి తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి మరి.