ఐదు కోళ్లతో మొదలు... నెలకు రూ.1.91 లక్షల లాభం! అండమాన్ మహిళ అద్భుత విజయం
- కేవలం ఐదు కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన అండమాన్ మహిళ
- శాస్త్రీయ శిక్షణతో కోళ్ల పెంపకంలో అద్భుత విజయం
- నెలకు 2,000 కోడిపిల్లల ఉత్పత్తి స్థాయికి వ్యాపార విస్తరణ
- కోళ్ల ఫామ్ ద్వారా నెలకు రూ.1.91 లక్షల నికర లాభం
- స్థానిక యువత, మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న రాజేశ్వరి
దృఢ సంకల్పం, శాస్త్రీయ పరిజ్ఞానం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు దక్షిణ అండమాన్‌లోని వాండూర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల రాజేశ్వరి. కేవలం ఐదు పెరటి కోళ్లతో ప్రారంభమైన ఆమె ప్రస్థానం, ఇప్పుడు నెలకు సుమారు రూ.1.91 లక్షల నికర లాభాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. ఆమె విజయగాథ ఇప్పుడు స్థానిక యువతకు, మహిళలకు స్ఫూర్తినిస్తోంది.
బోటనీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన రాజేశ్వరి, ఉద్యోగంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో 2023లో శ్రీ విజయపురంలోని ఐకార్-సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐసీఏఆర్-సీఐఏఆర్ఐ)ను సంప్రదించారు. అక్కడ కోళ్ల పెంపకం, వాటికి సరైన వసతి, ఆరోగ్య సంరక్షణ, వ్యాక్సినేషన్, దాణా తయారీ వంటి అంశాలపై ఆమె శాస్త్రీయ శిక్షణ పొందారు. సంస్థ అందించిన నిరంతర సాంకేతిక సహకారంతో తన యూనిట్‌ను క్రమంగా విస్తరించి, కోళ్ల పెంపకాన్ని ఒక పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చుకున్నారు.
ప్రస్తుతం ఆమె ఫామ్‌లో 2,500 గుడ్ల సామర్థ్యం గల మినీ-ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 550 మదర్ బర్డ్స్ (పేరెంటల్ స్టాక్), మాంసం కోసం 1,200 కోళ్లను పెంచుతున్నారు. ఈ మదర్ బర్డ్స్ ద్వారా నెలకు 3,600 గుడ్లు రాగా, వాటిలో 2,500 గుడ్లను పొదిగించడం ద్వారా దాదాపు 80% హేచబిలిటీతో నెలకు 2,000 కోడిపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు.
ఐకార్ నివేదిక ప్రకారం, రాజేశ్వరి ప్రతినెలా సుమారు 600 కిలోల కోడి మాంసం, 600 కోడిపిల్లలు, 1,100 టేబుల్ ఎగ్స్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ సమీకృత విధానం ద్వారా ఆమె నెలకు రూ.1.91 లక్షల నికర లాభం ఆర్జిస్తున్నారు. ఈ వ్యాపారంలో ఆమె పెట్టుబడికి ప్రతిఫలం (బెనిఫిట్-కాస్ట్ రేషియో) 2.02గా ఉండటం విశేషం. ఒకప్పుడు ఇంటి అవసరాల కోసం ఐదు కోళ్లను పెంచుకున్న రాజేశ్వరి, ఇప్పుడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.