హీరో విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ... సినిమా హాల్ ధ్వంసం, దుకాణాలకు నిప్పు!
Add ap7am to your home Screen

హీరో విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ... సినిమా హాల్ ధ్వంసం, దుకాణాలకు నిప్పు!

  • నేడు విడుదలైన 'బిజిల్'
  • ప్రత్యేక షో వేయలేదని ఫ్యాన్స్ ఆగ్రహం
  • లాఠీచార్జ్ చేసిన పోలీసులు
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందిన 'బిగిల్' (తెలుగులో విజిల్) నేడు విడుదల కాగా, సినిమాను అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించలేదంటూ, తమిళనాడులోని కృష్ణగిరిలో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. సినిమా హాల్ ను ధ్వంసం చేయడంతో పాటు సమీపంలోని దుకాణాలకు నిప్పు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.

దీంతో రెచ్చిపోయిన అభిమానులు.. పోలీసులు, మునిసిపాలిటీ వాహనాలను తగులబెట్టారు. 'బిగిల్' ప్రత్యేక షో వేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. వారిని చెదరగొట్టిన పోలీసులు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేయగా, పాజిటివ్ టాక్ వస్తోంది. అటు మాస్ పాత్రలో, ఇటు సెంటిమెంట్ ను పండించే పాత్రలో తమ హీరో ఇరగదీశాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Bigil
Vijil
Vijay
Tamilnadu
Krishnagiri
Police

More Telugu News