లండన్ ఇంటర్వ్యూలో 'శివ' చిత్రాన్ని గుర్తు చేసిన ప్రభాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లండన్ ఇంటర్వ్యూలో 'శివ' చిత్రాన్ని గుర్తు చేసిన ప్రభాస్!

  • లండన్ ఆల్బర్ట్ హాల్ లో 'బాహుబలి' ప్రదర్శన
  • అనంతరం ఆంగ్ల దినపత్రికకు ప్రభాస్ ఇంటర్వ్యూ
  • వర్మ చిత్రాన్ని గుర్తు చేసుకున్న యంగ్ రెబల్ స్టార్
లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైన తొలి ఆంగ్లేతర చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 5 వేల మంది ఒకేసారి ఈ సినిమాను చూడగా, చిత్ర ప్రదర్శనకు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క తదితరులతో పాటు నిర్మాత శోభూ యార్లగడ్డ కూడా హాజరయ్యారు.

చిత్ర ప్రదర్శన ముగిసిన అనంతరం ప్రభాస్ ఓ ఆంగ్ల దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగా, అదిప్పుడు బయటకు వచ్చింది. 'బాహుబలి' కన్నా ముందు నార్త్ ఇండియాలో ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న తెలుగు సినిమా ఏదైనా ఉందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇచ్చాడు.

మూడు దశాబ్దాల క్రితమే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' చిత్రాన్ని గుర్తు చేశాడు. ఆ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటిందన్నాడు. అయితే, మొత్తం మీద ఉత్తర భారతావనిలో భారీ విజయాలు సాధించిన తెలుగు సినిమాల సంఖ్య మాత్రం తక్కువేనన్నారు.
Prabhas
Siva
Bahubali
Ramgopal Varma

More Telugu News