విజయ్ తో జోడీకట్టే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను: తమన్నా
Add ap7am to your home Screen

విజయ్ తో జోడీకట్టే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను: తమన్నా

  • 'సైరా'తో తమన్నా ఖాతాలోకి మరో హిట్ 
  • తమిళంలో విడుదలైన 'పెట్రోమ్యాక్స్'
  • విజయ్ జోడీగా 'సుర' మూవీ చేశానన్న తమన్నా 
తెలుగులో ఈ నెల 2వ తేదీన విడుదలైన 'సైరా' చిత్రంలో తమన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో .. తన పాత్రకి మంచి పేరు రావడంతో ఆమె ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తమన్నా తమిళంలో చేసిన 'పెట్రోమ్యాక్స్' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ఉండగా హీరో విజయ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడామె స్పందిస్తూ .. "చాలా కాలం క్రితం విజయ్ తో కలిసి 'సుర' సినిమాలో నటించాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా చిన్నది. పాటల షూటింగు సమయంలోను సెట్ కి వచ్చేసి డాన్సులు చేసేసి వెళ్లిపోయేదానిని. అప్పటికే విజయ్ పెద్ద స్టార్ కావడం వలన ఎక్కువగా మాట్లాడేదానిని కాదు. ఆయనతో మరోసారి జోడీ కట్టాలని వుంది. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
Tamannah
Vijay

More Telugu News