బాలకృష్ణను దండించి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?: చంద్రబాబు వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందన
- సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు బాధపడుతున్నారు
- మోదీ గురించి బాలకృష్ణ పిచ్చికూతలు కూశారు
- తాను తీసుకున్న గోతిలోనే పడ్డట్టుంది మీ పరిస్థితి
'సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు బాధపడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు హాజరైన ధర్మపోరాట దీక్ష వేదికపై దేశ ప్రధాని మోదీ గురించి మీ బావ బాలకృష్ణ పిచ్చికూతలు కూశారు. బాలకృష్ణను మీరు దండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? తాను తీసుకున్న గోతిలోనే పడ్డట్టుంది మీ పరిస్థితి. ఇప్పటికైనా కళ్లు తెరవండి' అంటూ ట్వీట్ చేశారు.