‘చిత్రపురి’లో ఇళ్లు దక్కనివారికి అండగా నిలుస్తా!: జనసేన అధినేత పవన్ కల్యాణ్
- ఈ విషయాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తాం
- దీనిపై టాలీవుడ్ పెద్దలతో మాట్లాడతా
- చిత్రపురి సాధన సమితి సభ్యులతో జనసేనాని
చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల్లో తాము పనిచేస్తున్నామనీ, కానీ చిత్రపురిలో ఇతరులకు ప్లాట్స్ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ విషయమై పోరాడినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినవారికి పని దొరక్కుండా చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న జనసేనాని.. చిత్రపురిలో తెలుగుసినిమా వారి ఇంటి కల నెరవేరాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ఇతరులతో మాట్లాడుతామనీ, జనసేన పార్టీ ఆర్టిస్టులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.