'సాహో' చిత్రం ఫలితంపై కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' చిత్రం ఫలితంపై కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి వ్యాఖ్యలు

  • ఐమ్యాక్స్ లో 'సాహో' వీక్షించిన శ్యామలాదేవి
  • గురువారం రాత్రి నుంచే పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయని వెల్లడి
  • ప్రభాస్ నమ్మకాన్ని సుజీత్ నిలబెట్టాడంటూ కితాబు
తెలుగు చిత్రపరిశ్రమలో దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన 'సాహో' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సాహో సినిమాకు సుజీత్ దర్శకుడు. విడుదలకు ముందే భారీ హైప్ సంపాదించుకున్న ఈ చిత్రం వేల సంఖ్యలో స్క్రీన్లపై ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రభాస్ పెద్దమ్మ, నటుడు కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి కూడా వీక్షించారు. హైదరాబాద్ ఐమ్యాక్స్ థియేటర్ లో అభిమానులతో కలిసి సాహో చిత్రం చూసిన ఆమె తన అభిప్రాయాలను మీడియాకు తెలిపారు.


గురువారం రాత్రి నుంచే 'సాహో'పై పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయని, హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉందంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మంచి వార్తలే వింటున్నామని, సాహో ఫలితంపై తాము చాలా ఆనందంగా ఉన్నామని వెల్లడించారు. ప్రీమియర్ షోలు చూసినవాళ్లు ఫోన్లు చేసి సినిమా బాగుందని చెబుతున్నారని, ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సుజీత్ నిలబెట్టుకున్నాడని పేర్కొన్నారు. ప్రభాస్ ఓ అంతర్జాతీయ స్థాయి హీరో అయినా, చిన్న దర్శకుడు సుజీత్ కు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు.
Prabhas
Saaho
Krishnamraju
Shyamala Devi

More Telugu News